ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం
హైదరాబాద్ (CLiC2NEWS): నష్టాల్లో ఉన్న.. తెలంగాణ ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీలోనూ సజ్జనార్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఆర్టీసీ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటూ.. అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు.
ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు సరికొత్త ప్రణాళికలతో ముందుకెళ్తున్న సజ్జనార్.. శుభకార్యాల సమయంలో ఆర్టీసీ బస్సులు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా మరో నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆసెక్యూరిటి డిపాజిట్ లేకుండానే ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారికంగా ట్వీట్ చేసింది.
ఈ మేరకు సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
“ఎటువంటి అడ్వాన్స్ లేకుండానే వివాహాది శుభకార్యాలకు టీఎస్‌ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నట్టు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ చెప్పారు. #Telangana రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని ఆయన ఒక ప్రకటనలో కోరారు.“ అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
ఈ మేరకు బస్సు అవసరమైన వారు సమీప డిపో మేనేజర్‌ను సంప్రదించాలంటూ సూచించారు. దీంతోపాటు ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు.. 040-30102829, 040-68153333 ద్వారా ప్రజలు సమాచారం పొందవచ్చని సూచించారు.
ఎటువంటి అడ్వాన్స్ లేకుండానే వివాహాది శుభకార్యాలకు టీఎస్‌ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నట్టు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ చెప్పారు. #Telangana రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని ఆయన ఒక ప్రకటనలో కోరారు.@tsrtcmdoffice pic.twitter.com/alrlsLExjP
— AIR News Hyderabad (@airnews_hyd) October 23, 2021