బండ్లగూడ కారు ప్రమాదంపై స్పందించిన ఆర్‌టిసి ఎండి సజ్జనార్

హైదరాబాద్ (CLiC2NEWS): బండ్లగూడలో జరిగిన కారు ప్రమాదంపై ఆర్‌టిసి ఎండి సజ్జనార్ స్పందించారు. నిన్న జరిగిన దుర్థటన అత్యంత దురదృష్టకరమని సజ్జనార్ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఓ యువకుడి నిర్లక్ష్యం మితిమీరిన అతివేగం.. ఇద్దరు ప్రాణాలను బలితీసుకుందని.. మరో ఇద్దరిని గాయాలపాలు చేసిందన్నారు. తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఉండవచ్చు కానీ వాహనాలు ఇచ్చేటపుడు ఇకటికి రెండు సార్టు ఆలోచించాలన్నారు. పిల్లలమీద అతిప్రేమతో వాహనాలిచ్చి రోడ్లపైకి పంపితే ఇలాంటి దుర్ఘటనలే జరుగుతాయని సజ్జనార్ ట్వీట్ చేశారు.
బండ్లగూడలో మంగళవారం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కారు నడిపి వాకింగ్ చేస్తున్న మహిళలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. చనిపోయిన వారు అనురాధ ఆమె కుమార్తె మమత. వీరు మరో మహిళతో కలిసి వాకింగ్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.