డేటా సెంటర్ రావడం ఆనందంగా ఉంది: సిఎం జగన్

విశాఖ (CLiC2NEWS): ఈ సెప్టెంబర్ నుండి విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. విశాఖలో ఐటి టెక్ పార్క్ ఏర్పాటుకు బుధవారం సిఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. డేటా సెంటర్ రావడం ఆనందంగా ఉందన్నారు. డేటా సెంటర్‌తో విశాఖ ప్రగతి పథంలో దూసుకుపోతుందని.. టెక్నాలజి పార్క్‌తో విశాఖ రూపు రేఖలే మారిపోతాయన్నారు. ఇంత పెద్ద డేటా సెంటర్ దేశంలో ఎక్కడాలేదని.. దీంతో విశాఖ టయర్-1 సిటీగా మారిపోతుందన్నారు. ఈ సందర్బంగా ఆదానీ గ్రూప్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న ఏడేళ్లలో రూ. 22వేల కోట్ల పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉందని.. అంతే కాకుండా 40 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.