జి-20 సదస్సు నిర్వహణకు సరైన దేశం భారత్: రిషి సునాక్
ఈనెల 9,10 తేదీల్లో భారత్ రానున్న రిషి సునాక్

ఢిల్లీ (CLiC2NEWS): జి-20 సదస్సు నిర్వహించడానికి సరైన సమయంలో సరైన దేశానికి అవకాశం వచ్చిందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. భారత్‌లో ఈ నెల 9,10 తేదీల్లో జరగబోయే జి-20 శికరాగ్ర సదస్సుకు బ్రిటన్ ప్రధాని రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడంపై ఆయన స్పందించారు. భారత్ స్థాయి, వైవిధ్యం, అసాధారణ విజయాలు జి-20 సదస్సుకు అధ్యక్షత వహించడానికి సరైన సమయంలో సరైన దేశమని తెలుపుతున్నాయన్నారు. ఏడాది కాలంగా ప్రధాని నరేంద్రమోడీ ఈ సమావేశాలకు సమర్థవంతమైన నాయకత్వం వహించారన్నారు. యుకె, భారత్ మధ్యం ఉన్న సంబంధం వర్తమానం కంటే రెండు దేశాల భవిష్యత్తును ఎక్కువగా నిర్వచిస్తుందన్నారు.