ఉక్రెయిన్‌పై ర‌ష్యా మ‌రోసారి భీక‌ర దాడి

కీవ్‌ (CLiC2NEWS): ఉక్రెయిన్‌పై రష్యా భీక‌ర దాడి చేసిన‌ట్లు స‌మాచారం. ఈ సారి రికార్డు స్థాయిలో డ్రోన్ల‌ను ప్ర‌యోగించింది. ఏకంగా 188 డ్రోన్ల‌తో 17 ప్రాంతాల్లో ఈ దాడులు జ‌రిగిన‌ట్లు ఉక్రెయిన్ వైమానికి ద‌ళం ప్ర‌క‌టించింది. ఇటీవ‌ల వంద‌ల కొద్దీ గ్లైడ్ బాంబుల‌ను ర‌ష్యా ఉక్రెయిన్‌పై ప్ర‌యోగించింద‌ని అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ వెల్ల‌డించారు. 800 కెఎబి శ్రేణికి చెందిన 1500 కిలోల బ‌రువున్న బాంబుల‌తో దాడులు జ‌రిపిన‌ట్లు తెలిపారు. ఇంత‌లోనే మ‌ళ్లీ భారీ డ్రోన్ల‌తో విరుచుకుప‌డింది. అయితే కొన్ని డ్రోన్ల‌ను అడ్డుకున్న‌ట్లు అధికారులు తెలిపారు. డ్రోన్ల దాడిలో భ‌వ‌నాలు, జాతీయ ప‌వ‌ర్‌గ్రిడ్‌తో స‌హా మౌలిక స‌దుపాయాలు తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు స‌రిహ‌ద్దు ప్రాంతంలో ఉక్రెయిన్ ఉంచిన 39 డ్రోన్ల‌ను త‌మ సైన్యం ధ్వ‌సం చేసిన‌ట్లు ర‌ష్యా ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

Leave A Reply

Your email address will not be published.