భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు రష్యా సిద్ధం..

మాస్కో (CLiC2NEWS): ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా పిలుపు’.. నన్ను ఎంతగానో ఆకర్షించిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. భారత్‌లో భారీ మొత్తంలో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మాస్కోలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో పుతిన్.. మోడీ ‘ఇండియా ఫస్ట్’ విధానాన్ని ప్రశంసించారు. మోడీ ఇచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ పిలుపు మేరకు భారత్‌లో తయారీ కేంద్రాలను నెలకొల్పబోతున్నట్లు వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియా నిర్ణయం ప్రపంచంలో భారత్‌ను ఏ స్థాయికి తీసుకెళ్లిందో ఆయన వివరించారు.
దేశాభివృద్ధి, ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని జాతీయప్రయోజనాలకు భారత్ పెద్దపీట వేస్తోందన్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ స్వర్గధామంగా మారిందని.. అక్కడ పెట్టుబడులు పెట్టడం లాభదాయకంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్‌లో ఇప్పటికే రష్యాకు చెందిన రోస్నెఫ్ట్.. 20 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించారు.