రష్యా యుద్ధనౌక మాస్క్‌వా ధ్వంసం..
తీవ్రంగా దెబ్బతిన్నట్లు వెల్లడించిన రష్యా అధికారులు

కీవ్ (CLiC2NEWS): రష్యా యుద్ధ నౌక మిస్సైల్ క్రూయిజర్ మాస్క్‌వా తీవ్ర స్థాయిలో ధ్వంసమైంది. ఉక్రెయిన్‌లో తీర ప్రాంత నగరాలపై దాడులు చేసేందుకు భారీ ఆయుధ సామాగ్రిని తరలిస్తోంది. ఈ క్రమంలో రష్యా యుద్ధ నౌక తీవ్రంగా దెబ్బతిన్నది నౌకలో భారీగా పేలుడు కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నట్లు రష్యా అధికారులు ద్రువీకరించారు. కాగా యుద్ధనౌకలో భారీగా మందుగుండు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగందని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. కాగా ఈ ప్రమాదంలో సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించింది.
ఈ దాడిని తామే చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. రష్యా యుద్ధనౌక క్రూయిజ్ మాస్క్‌వా పై తామే క్షిపణితో దాడి చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించగా.. రష్యా మాత్రం ఉక్రెయిన్ ప్రకటనను తోసిపుచ్చింది.
కాగా ఆ యుద్ధ నౌకలో సుమారు 510 మంది సిబ్బంది ఉన్నారని, వారిని రష్యా రక్షించలేకపోయినట్లు ఉక్రెయిన్ తెలిపింది. బ్లాక్ సీలోని స్నేక్ ఐలాండ్ వద్ద ఉన్న మాస్క్‌వా క్రూయిజ్ నౌకపై దాడి జరిగినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. కానీ ఆ నౌకలో పేలుడు జరిగినట్లు రష్యా మరోవైపు చెబుతోంది.
మాస్క్‌వా మిస్సైల్ క్రూయిజర్‌ను 1980 ప్రాంతంలో నిర్మించారు. ఉక్రెయిన్‌లోని మైకోయిన్‌లోని మైకోలేవ్ నగరంలో ఆ నౌకను తయారు చేశారు. సోవియట్ నౌకాదళంలో ఈ నౌక కీలక పాత్ర పోషించింది. ఇది సుమారు 186 మీటర్ల పొడవుగల ఈ నౌకను మొదట్లో స్లావా అని పిలిచేవారు. కాలక్రమేనా మాస్క్‌వా అని పిలుస్తున్నారు.