ర‌ష్యా తాత్కాలిక కాల్పుల విర‌మ‌ణ‌..

భార‌తీయుల‌ను త‌ర‌లించేందుకు ప్ర‌త్యేక బ‌స్సుల‌ ఏర్పాటు

Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై ర‌ష్యా జ‌రుపుతున్న దాడుల‌కు తాత్కాలిక విరామాన్ని ప్ర‌క‌టించింది. ఆ దేశంలో మారియుపోల్‌, వోల్న‌వోఖ్ న‌గ‌రాల్లో మాన‌వ‌తా కారిడార్ ఏర్పాటు కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ర‌ష్యా ర‌క్ష‌ణ శాఖ ప్ర‌క‌టించింది. పౌరులను సుర‌క్షితంగా త‌ర‌లించేందుకు తాత్కాలిక కాల్పుల విరామం ర‌ష్యా క‌ల్పించిన‌ట్లు స‌మాచారం . ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విదేశీయుల‌ను శాంతియుతంగా త‌ర‌లించేందుకు ర‌ష్యా సైన్యం అన్నివిధాలా కృషి చేస్తుంద‌ని ర‌ష్యా రాయ‌బారి వాసిలీ నెబెంజియా తెలిపారు.

మ‌రోవైపు భార‌త ప్ర‌భుత్వం ఉక్రెయిన్ నుండి భార‌తీయుల‌ను త‌ర‌లించేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. పీసోచిన్‌లో ఉన్న 298 మంది భార‌తీయ విద్యార్థుల‌ను త‌ర‌లించేందుకు ఉక్రెయిన్‌లో ఉన్న ఇండియ‌న్ ఎంబ‌సి అధికారులు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేశారు.

Leave A Reply

Your email address will not be published.