ఉక్రెయిన్‌పై క్షిపణులు ప్రయోగించిన రష్యా.. ఏడుగురు పౌరులు మృతి

కీవ్ (CLiC2NEWS): రెండేళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా గురువారం ఉక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరం అయిన ఖర్కీవ్‌పై దాడులు నిర్వహించింది. భారీ క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో ఉక్రెయిన్‌కు చెందిన ఏడుగురు పౌరులు మృతి చెందినట్లు సమాచారం. మరో 16 మందికి గాయాలైనట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షడు జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు. రష్యాది అతికిరాతకమైన చర్యగా పేర్కొన్నారు. పాశ్చాత్య భాగస్వామ్య దేశాల నుండి తగిన సహకారం లభించడం లేదని, రష్యా వైమానికి దాడులను సమర్ధంగా ఎదుర్కొనేందుకు తగినన్ని రక్షణ వ్యవస్థలను సమకూర్చడంపై భాగస్వామ్య దేశాలు దృష్టి సారించడం లేదని నిరాశ వ్యక్తం చేశారు.