రసాయన కర్మాగారంపై రష్యా దాడి..
వందల మంది ప్రాణాలకు ముప్పు..!

డాన్‌బాస్ (CLiC2NEWS): ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంలో పారిశ్రామిక నగరమైన సివిరోదొనెట్స్క్పై రష్యా దాడులు తీవ్రమయ్యాయి. ఈక్రమంలో అక్కడ ఉన్న అజోట్ కెమికల్ ప్లాంట్‌పై భారీగా షెల్లింగ్ చేశారు. దీంతో అక్కడి రేడియేటర్లో టన్నుల కొద్దీ చమురు లీకవుతోంది. ఈ కర్మాగారంలో వందల మంది ప్రజలు తలదాచుకొన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఇక్కడ ఎంత మేరకు ప్రాణనష్టం చోటు చేసుకుందో తెలియరాలేదు. ప్లాంట్‌లోని అండర్‌గ్రౌండ్ బాంబ్ షెల్టర్లలో మాత్రం 800 మంది వరకు తలదాచుకొని ఉంటారని అంచనావేస్తున్నారు.
లుహాన్స్క్ గవర్నర్ షెర్లీ హైడెన్ మాట్లాడుతూ.. పరిస్థితి కఠినంగా ఉందని పేర్కొన్నారు. ఇక్కడ జరుగుతున్న పోరాటాల్లో తమ సైనికులు గెలుస్తున్నారన్నారు. కానీ, రష్యా శతఘ్నులు మాత్రం ఇళ్లను పూర్తిగా నేలమట్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో తమ దళాలు దాక్కోవడానికి అవకాశం లేకుండా పోయిందని తెలిపారు.