మరియుపోల్‌లోని పాఠశాలపై రష్యాబాంబు దాడి

ఉక్రెయిన్‌లోని మరియుపోల్ నగరంలో ఆర్ట్‌స్కూల్‌పై రష్యా సైన్యం బాంబు దాడి చేసింది. ఆస్కూల్‌లో సుమారు 400 మంది శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం సైనిక దాడి అనంతరం వారి పరిస్థితి గురించి సమాచారం ఇవ్వలేదు. రష్యా బాంబు దాడిలో స్కూల్ మొత్తం ధ్వంసంమైనట్లు అధికారులు తెలిపారు.
ఉక్రెయిన్‌పై రష్యా హైపర్ సోనిక్ క్షిపణులను ప్రయోగిస్తుంది. ఆదివారం మైకోలైవ్ పోర్టు సమీపంలోని చమురు డిపోను లక్ష్యంగా చేసుకొని రష్యా సైన్యం క్షిపణిని ప్రయోగించింది. శనివారం ఉక్రెయిన్ ఆయుధకర్మాగారంపై కింజల్ క్షిపణిని ప్రయోగించింది. దీనితో పాటు నల్ల సముద్రం, కాస్పసియన్ సముద్రంలోని తమ నౌకల నుండి ఉక్రెయిన్‌పై దాడులు చేసినట్లు రక్షణ శాఖ ప్రతినిధి తెలియజేశారు.