ఐదు నగరాల్లో రష్యా కాల్పుల విరమణ
మాస్కో (CLiC2NEWS): ఉక్రెయిన్‌లోని అయిదు నగరాల్లో రష్యా మంగళవారం కాల్పుల విరమణ ప్రకటించింది. మాస్కో కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటల నుంచి కీవ్, చెర్నిగోవ్, సుమీ, మేరియుపోల్, ఖర్కీవ్ నగరాల నుంచి పౌరుల తరలింపునకు మానవతా కారిడార్‌లను తెరుస్తుందని ఐఖ్యరాజ్య సమితిలో రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా పేర్కొన్నారు.
విద్యార్థుల తరలింపు నేపథ్యంలో భారత్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రష్యా తాజాగా ప్రకటన చేసింది. ఇప్పటికే భారత ప్రధాని మోడీ సుమీలో చిక్కుకున్న వారి విషయంపై ఉక్రెయిన్, రష్యా దేశాల అధినేతలో మాట్లాడారు.
కాగా ఉక్రెయిన్‌లోని పలునగరాల్లో చిక్కుకున్న పౌరుల తరలింపు ప్రక్రియ ఇప్పటికే మొదలైనట్లు సమాచారం.
In order to conduct a humanitarian operation from 12.30 IST on March 8, 2022, Russia declares cease-fire and is ready to provide humanitarian corridors. Read more ➡️ https://t.co/5FkSKPsLPj pic.twitter.com/oypKjjEExz
— Russia in India 🇷🇺 (@RusEmbIndia) March 8, 2022