ఈ నెల 28 నుండి రైతుబంధు నిధులు విడుదల..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త తెలిపింది. ఈ నెల 28వ తేదీ నుండి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. దీని కోసం రూ. 7,600 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. సంక్రాంతి కల్లా రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు.