ఎస్. వి.రమణా చారి: నా తల్లి శోకం..

యుద్ధాలు, పీడనలు కొత్తకాదు
కష్టాలు, కన్నీళ్లు పాతబడలేదు
నిలువెల్ల గాయాల వీణ
తనయ, తనయులను కోల్పోయి శోకతప్తగా మిగిలిన ధరణి మాత
ఓ రాజు కాలంలో
చూడని దాష్టీకం లేదు
నా బిడ్డల నగ్నత్వం తో
బతుకమ్మలాడించిన
బానిస వంశస్తుడువాడు
బాంచెన్ అనే సంస్కృతి నుంచి
బరిసేలందుకునే స్థితికి తెచ్చినవాడు
పోరాటం నేర్పిన ఎర్రజెండా
సాయుధ పోరాటమే రణతంత్రంగా
చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురన్న వంటి బిడ్డల వీరోచితం
మరో వైపు ఆనందంతో
తాండవిస్తూ
అఖిల భారతం మువ్వన్నెల పండుగ సంబరాలలో ఉండగా
ఏకాకిగా మిగిలిన తల్లి తెలంగాణను రాక్షస చరనుంచి
విడిపించిన భారత ప్రభుత్వమా
వేల వేల దండాలు అంటూ
తెలంగాణ జనత స్తుతించింది
భారతమ్మ ఒడిలో చేరిన నేల
విమోచనమా, విముక్తమా అంటూ ఎటూతేల్చని అధికార గణం
నేడు నా నేల గగన తలంలో
ఎగురుతున్న మువ్వన్నెల జండా
నీకు శతకోటి దండాలు
విముక్తమా, విలీనమా ఏదో తెలియని వెలితి
నా నేలకు, నా ప్రజలకు
గుండె గొంతుకలో కొట్టుమిట్టాడు తొంది
-ఎస్. వి.రమణా చారి
జర్నలిస్ట్, సెల్: +91 98498 87086