S.V.Ramanachary: స్వరాష్ట్రం కావాలి సురాష్ట్రం

జంగ్ సైరన్ ఊదాం…..
జై తెలంగాణ అంటూ నినదించాం
కురుక్షేత్ర యుద్దంలో పాంచజన్యంలా…
సకలజనుల సమర భేరి మోగింది
రణతంత్రంపు ఎత్తులు జిత్తులు చేశాం పటాపంచలం
ఆరాటం..పోరాటం..రాష్ట్ర అవతరణే లక్ష్యం అంటూ సాగాం
కోడి కూసినా..కోకిలమ్మ పాడినా…
పాట,కూతా ఏదైనా రాష్ట్ర కాంక్షే లక్ష్యం
బక్క పలుచని వాడే నాయకుడంటూ మలిదశ మొదలైంది రణం
అమర వీరుల సాక్షిగా ఆశల పల్లకి మోసాం
ఉస్మానియా దీప్తిగా చైతన్య ఊపిరులు ఊదాం
యువ,నవ సమాజం కోసం చేతులు కలిపాం
బరిగీసి కోట్లాడి తెలంగాణ సాధించాం
సిరిసంపదల తెలంగాణ కోసం కాకతీయ, భగీరధ జలయజ్ఞం
పారే నీళ్ళు బీళ్లకు తరలు తున్న వైనం
కోటి ఎకరాల మాగాణి పులకించిన తరుణం
రైతన్నకు ఆసరా రైతు బంధు ఆవిష్కరణం
జిలుగువెలుగుల విద్యుత్ సొబగుల చిత్రం
తాడిత పీడిత జనుల కోసం విభిన్న పధకాల సమాహారం
తాత,అవ్వలకు అందుతున్న ఫించన్ పధకం
పెండ్లి కోసం అక్కా,చెల్లెళ్ళకు ఇస్తున్న షాదీ ముబారక్
భలేగుంది అన్నిరంగాలలో అభివృద్ది ముద్ర
అన్నది చేశావు …అనుకున్నది సాధించావు
గుబాళించాలి తెలంగాణ మాగాణ చరిత్ర
వీడాలి మన పల్లె తల్లి గోస
స్వరాష్ట్రం కావాలి సురాష్ట్రం
-ఎస్.వి.రమణా చారి
సీనియర్ జర్నలిస్ట్.