మూడో టి20 లో సఫారీలపై భారత్ విజయం
SA vs IND: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగు టి20 సిరీస్‌లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో తెలుగు తేజం తిలక్ వర్మ 107 పరుగులతో అదరగొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన శాంసన్ పరుగులు చేయలేకపోయాడు. సూర్య 1, హార్దిక్ 18, రింకు 8.. ఇది భారత బ్యాటర్ల వరుస. తర్వాత తిలక్ .. 32 బంతుల్లో అర్ధసెంచరీ చేసి, మరో 19 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. భారత్ ఆరు వికెట్ల నష్టానికి 219 సాధించింది. అనంతరం 220 లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 208 పరుగులే చేయగలిగింది.
21 ఏళ్లకే టి20, వన్డేల్లో అడుగుపెట్టిన తిలక్ వర్మ.. అద్భుత ప్రదర్శనతో దూసుకొచ్చాడు. అతిపిన్న వయసులో అంతర్జాతీయ టి20 శతకం సాధించిన భారత్ బ్యాటర్‌గా తెలుగు కుర్రాడు తిలక్ స్థానం దక్కించుకున్నాడు. టాప్ 10 జట్లపై సెంచరీ చేసిన అతిపిన్న వయస్సు భారత బ్యాటర్ తిలక్ .