నేషనల్ ఐకాన్‌గా సచిన్.. ఇసితో ఒప్పందం
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/sachin.jpg)
న్యూఢిల్లీ (CLiC2NEWS): ఎన్నికల ప్రక్రయలో ఓటరు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను భారత్ ఎన్నికల సంఘం `ఎన్నికల ప్రచార కర్త`గా నియమించనుంది. ఈ మేరకు బుధవారం ఒప్పందం కుదుర్చుకోనుంది. రానున్న ఎన్నికల్లో దేశంలోని యువతకు ఓటింగ్‌పై అవగాహన కల్పించేందుకు సచిన్ పలు రకాల కార్య క్రమాలు నిర్వహించనున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికలలో సచిన్ ఓటర్ల చైతన్య ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు అనేక రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులను నేషనల్ ఐకాన్స్‌గా ఎలక్షన్ కమిషన్ ఓటరు అవాగాహన కోసం నియమించుకుంటోంది.