సచిన్ సెక్యూరిటి గార్డ్ ఆత్మహత్య..!
![](https://clic2news.com/wp-content/uploads/2024/05/Sachins-security-guard-committed-suicide.jpg)
ముంబయి (CLiC2NEWS): భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సెక్యూరిటి గార్డ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సచిన్ వివిఐపి సక్కూరిటి విధులు నిర్వహిస్తున్న స్టేట్ రిజర్వ పోలీస్ ఫోర్స్ జవాన్ ప్రకాశ్ కాప్డే తుపాకీతో మెడపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్ర లోని జామ్నెర్ పట్టణంలోని అతడి స్వస్థలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్ధరాత్రి దాటిన తర్వాత తన ఇంట్లోనే అతడు ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వ్యక్తి గత కారణాల వల్ల అతను ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని.. విచారణ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడస్తామని పోలీసులు తెలిపారు. ప్రకాశ్‌కు తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.