సలార్ పార్ట్-1 ట్రైలర్ రిలీజ్..

Salaar Trailer (CLiC2NEWS): ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్ప చిత్రం సలార్. సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నప్పటికీ ఈ చిత్రం వాయిదాపడుతూ వచ్చింది. ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా సలార్ పార్ట్ 1 – సీజ్ఫైర్ ట్రైలర్ను విడుదలచేసింది. 3 నిమిషాల 47 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేకిత్తిస్తోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడుగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్, పృథ్వీరాజ్ల చిన్ననాటి స్నేహానికి సంబంధించిన సన్నివేశాలతో ట్రైలర్ సాగుతుంది. బాలివుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు టీనూ ఆనంద్, జగపతిబాబు, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.