‘శుభం చిత్రం సక్సెస్ మీట్‌లో సమంత..

హైదరాబాద్ (CLiC2NEWS): నిర్మాతలు ఎందుకు వరుసగా సినిమాలు చేస్తారో ఇప్పుడర్థమైందని నటి సమంత అన్నారు. ఈ చిత్రంలో సమంత అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. స్వీయ నిర్మాణంలో తాను నిర్మించిన శుభం చిత్రం సక్సెస్ మీట్ శుక్రవారం నగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. నిర్మాతలు ఎందుకు వరుసగా సినిమాలు చేస్తారో ఇప్పుడర్థమైందని, ప్రేక్షకుల ముఖంపై చిరునవ్వులు చూడడమే అందుకు కారణమన్నారు. తనకు స్కూల్ డేస్ గుర్తొచ్చాయని, సమ్మర్ హాలిడేస్‌లో అమ్మ మా కోసం ఎంత కష్టపడిందో ఇప్పుడు తెలిసొచ్చిందన్నారు. పిల్లలు నిరుత్సాహపడకుండా సినిమాకి తీసుకెళ్లాలి అని పరితపించేదని , ఆమె కష్టం గుర్తొచ్చిందన్నారు. థియేటర్లో సందడి చేస్తూ.. పాప్‌కార్న్ కోసం సోదరుడితో గొడవ పడడం, చూసిన సినిమా గురించి చర్చించుకోవడం.. ఇవన్నీ నిన్ననే జరిగినట్లుగానే ఉందన్నారు. నాటి జ్ఞాపకాలను ఫ్యామిలి ఆడియన్స్ కోసం రి క్రియేట్ చేయాలనిపించి.. ఆ క్ష్యంతోనే ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ నెలకొల్పానన్నారు.
శుభం సినమా విషయంలో తెలుగు ఆడియన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులకు సినిమా నచ్చితేనే విజయం అందుకుంటుందన్నారు. నిర్మాతగా తొలి అడుగులు వేస్తున్న తనకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సపోర్ట్ చేసిందని తెలిపారు. కొ-ప్రొడ్యూసర్స్ రాజ్, హిమాంక్ ట్రాలాలాకు వెన్నెముకలాంటివారు. ప్రవీణ్ టీమ్ ప్లేయర్ అని , ఇగో లేని వ్యక్తి అన్నారు.