సమంత బర్త్డే.. సర్ప్రైజ్ ప్లాన్ చేసిన విజయ్..
సమంత జన్మదినం సందర్భంగా విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ ఇచ్చాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి నటిస్తున్న విషయం తెలిసినదే. కశ్మీర్లో ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. సమంత పుట్టినరోజును పురస్కరించుకొని చిత్ర దర్శకుడితో సినిమా స్క్రిప్టులో లేని ఓ ఫేక్ సీన్ రాయించాడు. ఈ విషయం తెలియని సమంత సన్నివేశంలో లీనమై, భావోద్వేగానికి గురైంది. “ఎందుకిలా ఉన్నావ్? వెళ్లి పోతున్నావా? పది రోజుల్లో వచ్చేస్తా. నువ్వు మా ఊరొచ్చి మా తల్లి దండ్రులతో మాట్లాడటం కాదు.. నేనే మీ వాళ్లతో మాట్లాడి మన పెళ్లికి ఒప్పిస్తా..” అంటూ సమంత ఫీల్ అవుతుండగా విజయ్ హ్యాపీ బర్తడే అని ఆమెను ఆశ్చర్యపరిచాడు. తర్వాత దర్శకుడు, సాంకేతిక నిపుణులు కేకును తీసుకొచ్చి, సమంతతో కట్ చేయించారు.