పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో సమంతకు మొదటి స్థానం
హైదరాబాద్ (CLiC2NEWS): అగ్రకథానాయిక సమంత పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. గతంలో తొమ్మిదో స్థానంలో ఉన్న ఆమె అగ్ర తారలను వెనుకకునెట్టి ఈ సారి ఫస్ట్ ప్లేస్‌కు చేరుకుంది. సినీ హీరోయిన్ సమంతకు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇండియన్ మూవి డేటాబేస్ (ఐఎండిబి) వాళ్లు ఇచ్చిన రేటింగ్ ప్రకారం.. మన దేశంలో పాపులర్ ఇండియన్ సెలబ్రెటి లిస్ట్‌లో మొదటి స్తానం సొంతం చేసుకుంది. 17వ స్థానంలో పూజాహెగ్దే ఉన్నారు. ఇదేకాకుండా ఆర్మాక్స్ లిస్టులో సమంత వరుసగా ఏడు పర్యాయాలు టాప్‌లో ఉంది. ప్రస్తుతం సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ తెలుగు వెర్షన్లో నటిస్తుంది.