శాంసంగ్ ఎఫ్ 55.. లాంచ్ ఆఫర్లు..

Samsung Galaxy F55 : ప్రముఖ మొబైల్ సంస్థ శాంసంగ్ తమ కొత్త 5జి ఫోన్‌ను ఎఫ్ 55 పేరిట లాంచ్ చేసింది. లెదర్ ఫినిష్‌తో ఈ ఫోన్.. ఎన్ ఎఫ్‌సి, ముందూ వెనుక 50 ఎంపి కెమెరాలలతో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 ఎంపి ప్రధాన కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తోంది. ప్లిప్కార్డ్లో నేటి నుండి వీటి అమ్మకాలు జరుగనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8జిబి+128జిబి బేస్ వేరియంట్ ధరను రూ. 26,999గా.. 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ. 29,999గా.. 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ. 32,999గా కంపెనీ నిర్ణయించింది.
శాంసంగ్ ఎఫ్ 55 ఫోన్ లాంచ్ ఆఫర్ కింద 31వ తేదీ లోపు కొనగోలు చేసే వారికి 45w అడాప్టర్‌ను రూ. 499కే విక్రయించనున్నారు. లేదంటే ఫిట్ 3 స్మార్ట్ వాచ్‌ను రూ. 1999కే కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి కార్డుతో మొబైల్ కొనుగోళ్లపై రూ. 2 వేలు డిస్కౌంట్ లభిస్తుంది.