పారిశుద్ధ్య కార్మికులకు రూ. 1000 వేతనం పెంపు.. త్వరలో ఆర్‌టిసి కార్మికులకు..
హైదరాబాద్ (CLiC2NEWS): కార్మికుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వేతనాలను రూ.వెయ్యి చొప్పున పెంచాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ మేరక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలోని మెట్రో వాటర్ వర్క్స్‌తో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటిలు, గ్రామపంచాయతీల్లో పనిచేస్తూ ఉన్నటువంటి కార్మికులందరికీ.. ఇది వర్తిస్తుందని తెలిపారు. పెంచిన వేతనాలు తక్షణమే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. త్వరలో ఆర్‌టిసి ఉద్యోగుల వేతనాలు కూడా పెంచాలని నిర్ణయించారు. దీని కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్ధిక శాఖను ఆదేశించినట్లు సిఎం తెలిపారు.