ఆర్‌బిఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ కార్యదర్శిగా ఉన్న సంజయ్ మల్హోత్రా తదుపరి గవర్నర్‌గా కేంద్రం నియమించింది. మల్హోత్రా 26వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి, మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.
2018లో ఆర్‌బిఐ గవర్నర్ గా శక్తికాంత దాస్ బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం 2021లోనే ముగియనుండగా.. మరో మూడేళ్లు కేంద్రం పొడిగించింది. ఈ గడువు డిసెంబర్ 10తో ముగియనుంది. దీంతో కొత్త గవర్నర్ నియామకానికి కేబినేట్ నియామకాల కమిటి ఆమోదం తెలపడంతో సంజయ్ మల్హాత్రా బాధ్యతలు చేపట్టారు.