‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ ట్రైల‌ర్ రిలీజ్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేశ్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’. ఐశ్వ‌ర్య రాజేశ్ మీనాక్షి చౌద‌రి క‌థానాయిక‌లుగా నటించారు. ఈ చిత్రం ఈనెల 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్రం బృందం తాజాగా చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. హీరో మ‌హేశ్ బాబు సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేశారు.  మ‌రోసారి వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ చిత్రం విడుద‌ల కానుంది.

నిజామాబాద్ న‌గ‌రంలోని క‌లెక్ట‌ర్ గ్రౌండ్స్‌లో ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ నిర్వ‌హించారు. కుటుంబ స‌భ్యులంతా క‌లిసి చూసేలా ఈ చిత్రం ఉంటుంద‌ని.. ఈ చిత్రంతో పాటు డాకు మ‌హారాజ్‌, గేమ్ ఛేంజ‌ర్ సినిమాలు మంచి విజ‌యం సాధించాలని వెంక‌టేశ్ అన్నారు. భార్య‌కు అల్జీమ‌ర్స్ వ‌చ్చినా కానీ.. భ‌ర్త‌ల‌ ఫ్లాష్ బ్యాక్ మాత్రం మ‌ర్చిపోరు. అందుకేమీ గ‌తం గురించిమీ వైఫ్‌కు చెప్పొద్ద‌ని న‌వ్వులు పూయించారు.

Leave A Reply

Your email address will not be published.