మే 15నుండి 26 వరకు సరస్వతి నది పుష్కరాలు..
హైదరాబాద్ (CLiC2NEWS): మే 15 నుండి 26 సరస్వతి నది పుష్కరాలు జరగనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి దన్యవాదాలు తెలియజేశారు. అత్యంత వైభవంగా సరస్వతీ నది పుష్కరాలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. పుష్కరాల సందర్బంగా పుష్కారాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నది ప్రాంతంలో స్నాన ఘట్టాలు, డ్రైనేజిల నిర్మాణం, రోడ్ల విస్తరణ కు ఈ నిధులు వినియోగించనున్నట్లు సమాచారం. నిర్వహక పనులు చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.