‘సరిపోదా శ‌నివారం’.. నాని యాక్ష‌న్ ‘ట్రైల‌ర్’ విడుద‌ల‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌కత్వంలో నాని హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం ‘స‌రిపోదా శ‌నివారం’. ‘అంటే.. సుంద‌రానికి’ సినిమా త‌ర్వాత నాని-వివేక్ చేస్తున్న చిత్రం ఇది. మొద‌టి సినిమాకు పూర్తి భిన్నంగా యాక్ష‌న్ క‌థాంశంతో తెర‌కెక్కించారు. ఈ నెల 29న ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. ఈ సినిమాలో ప్రియాంక మోహ‌న్ క‌థానాయిక‌గా న‌టించింది.

సుద‌ర్శ‌న్ థియోట‌ర్లో నిర్వ‌హించిన ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంలో నాని, ప్రియాంక , ఎస్‌జె సూర్య తో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు. ఎస్ జె సూర్య మాట్లాడుతూ.. కొత్త ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించ‌డంలో నాని ముందుంటారని కొనియాడారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ చిత్రం నిర్మించిన‌పుడు ఈ థియేట‌ర్‌కు వ‌చ్చాన‌ని గుర్తు చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.