Mahesh babu: `సర్కారువారి పాట` ఫస్ట్ లుక్ వచ్చేసింది
హైదరాబాద్ (CLIiC2NEWS): సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అభిమానులకు సర్ప్రైజ్ వచ్చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’. శనివారం ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో మహేష్ బాబు లుక్ ఆకట్టుకుంటోంది. ఇంతకుముందెన్నడూ లేని విధంగా మహేశ్‌లుక్ అలరిస్తోంది. పొడవాటి జుట్టు, మెడపై రూపాయి కాయిన్ టాటూతో ఎరుపు రంగు కారులోని నుంచి మహేశ్ స్టైల్‌గా దిగుతున్న ఈ ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అవుతోంది. బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం. పూర్తి మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను పరుశురామ్ తీర్చిదిద్దుతున్నారు.
సంక్రాంతి కానుకగా జనవరి 13, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్టైన్మెంట్,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.
