షేక్.బహర్ అలీ: శశాంకాసనం

ఈ ఆసనంలో శరీరం కుందేలు ఆకారంలో ఉంటుంది. గనుక దీనిని శాశంకాశనం అని పేరు వచ్చింది. ఉస్ట్రాసనంలో వెన్నుముకను వెనుకకు వంచితే ఈ ఆసనంలో అది ముందుకు వంగుతుంది. విశ్రాంతి ఇచ్చే ఆసనమే ఇది.
1. వెన్నును భూమికి సమాంతరంగా ఉంచటం వలన విశ్రాంతి లభిస్తుంది.
2. గుండె, స్ప్లీన్, అన్నాశయం, వంటి అవయవాలు,, తొడలు, నొక్కుకోవటం వలన చురుకుగా పనిచేస్తాయి.
3. శ్వాస పీల్చే శక్తి పెరుగుతుంది.
4. ఆయాసం లాంటి వ్యాధులకు మంచి మందులాగా ఆసనం పనిచేస్తుంది
5. అన్ని రకాల ఆవేశలను, రకరకాలుగా వచ్చిపోయే భావాలను, తగ్గించుకొని సమర్పణ భావాన్ని ఈ ఆసనం ద్వారా పెంచుకోవచ్చును..
చేసే విధానం:
వజ్రాసనంలో కూర్చోని నడుము,మెడ తిన్నగా ఉంచవలెను. శ్వాసను తీసుకుంటు రెండు చేతులను పైకి ఎత్తాలి. శ్వాసను విడుస్తూ చేతులను ముందుకు చాపూతు సాధ్యమైనంత వరకు ముందుకు వంగాలి. తలను భూమి పైన అనించాలి. చేతులు వదులుగా చేసి మోచేతులను భూమిపైన అనించాలి. శ్వాసను మాములుగా పిల్చాలి. కొద్ది క్షణాలు ఇలానే ఉండాలి. శ్వాసను పీల్చుతూ చేతులను పైకి చాపూతు వెనక్కు తిరిగి తేవాలి. వజ్రాసనంలో కూర్చోవాలి. ధ్యాన కేంద్రం… ఆజ్ఞాచక్రం. ముందుకు వంగుతున్నపుడు పిరుదలు పైకి లేవకూడదు.
–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు