తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సతీశ్‌చంద్రశర్మ?
కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫారసు!
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం జస్టిస్ శర్మ కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ హైకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ శర్మను నియమించాలని కొలీజియం సిఫారసు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం ఈ సిఫారసులను ఆమోదించి, రాష్ట్రపతికి పంపిస్తుంది. ఆయన ఆమోదం పొంది, కేంద్ర న్యాయశాఖ గెజిట్‌ను ప్రచురించాక జస్టిస్ శర్మ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేస్తారు.
ప్రస్తుతం 8 రాష్ర్టాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు లేకపోవడంతో ఈ పదవుల భర్తీపై సుప్రీంకోర్టు కొలీజియం దృష్టి కేంద్రీకరించింది.
- తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ
- అలహాబాద్ హైకోర్టు సీజేగా జస్టిస్ రాజేశ్బిందాల్
- కలకత్తా హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ
- ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా
- కర్ణాటక హైకోర్టు సీజేగా జస్టిస్ రీతూరాజ్ అవస్థీ
- మేఘాలయ హైకోర్టు సీజేగా జస్టిస్ రంజిత్ వీ మోర్
- గుజరాత్ హైకోర్టు సీజేగా జస్టిస్ అరవింద్ కుమార్
- మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా జస్టిస్ ఆర్వీ మలిమత్
వీరిని నియమించాలని కేంద్ర న్యాయ శాఖకు సిఫా ర్సు చేసినట్లు అభిజ్ఞ వర్గాలు తెలిపాయి.
అయిదుగురు వివిధ హైకోర్టుల సీజేలు, 28 మంది జడ్జిల బదిలీకి కొలీజియం సిఫారసు చేసినట్టు తెలిపాయి.
తెలంగాణ హైకోర్టు తాతాలిక ప్ర ధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావును పంజాబ్-హర్యానా హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసినట్టు సమాచారం.
తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచే స్తున్న జస్టిస్ టీ అమర్నాథ్గౌడ్ను త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.