ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్..
![](https://clic2news.com/wp-content/uploads/2022/10/Election-Commission.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): దేశంలో ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఆగస్టు 10వ తేదీన గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. కేరళ, ఝార్ఖండ్, త్రిపుర, బెంగాల్, ఉత్తరాఖండ్ యుపి రాష్ట్రాల్లో కొంత మంది ఎమ్మెల్యేలు మరణంతో.. మరికొంత మంది రాజీనామాతో ఆయా స్థానాల్లో ఏర్పడిన ఏడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆగస్టు 17వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. 18 నుండి నామినేషన్ల పరిశీలన.. నామినేషన్ల ఉపసంహరణకు తుది గుడువు ఆగస్టు 21 వరకు ఉంది. సెప్టెంబర్ 5వ తేదీన పోలీంగ్ నిర్వహించనున్నారు.
ఉత్తర ప్రదేశ్‌లోని ఘోసి, త్రిపురలోని ధన్‌పుర్ స్థానాల్లో ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆ స్థానాల్లో ఖాళీ ఏర్పడింది. అలాగే కేరళ పూతుపల్లి మాజీ సిఎం ఉమెన్ చాందీ, త్రిపురలోఇన బోక్సానగర్, బెంగాల్ లోని ధూప్‌గురి, ఉత్తరాఖండ్లోని బాగేశ్వర్‌లలో ఎమ్మెల్యేలు మృతి చెందడంతో.. ఉప ఎన్నికలు అనివార్యమైనాయి.