ఎపిలో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌.. పాఠ‌శాల‌ల రీ ఓపెనింగ్‌ తేదీ వాయిదా..

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాఠ‌శాల‌ల పునఃప్రారంభ తేదీ వాయిదా ప‌డింది. ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం జులై 4వ తేదీన పాఠ‌శాల‌లు తెరుచుకోవ‌లసి ఉంది. అయితే ఆదే రోజు ప్ర‌ధాని మోడీ రాష్ట్ర ప‌ర్య‌ట‌న దృష్ట్యా ఒక రోజు వాయిదా వేసిన‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది. జులై 4కు బ‌దులు జులై 5వ తేదీన పాఠ‌శాల‌లు తెర‌వాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశించింది.

జులై 4వ తేదీన ప్ర‌ధాన మంత్రి భీమ‌వ‌రంలో పర్య‌టించ‌నున్నారు. ఆజాదీ కా ఈమృత్ ఉత్స‌వాల్లో భాగంగా మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు 125వ జ‌యంతి ఉత్స‌వాలు నిర్వ‌హించ‌నున్నారు. కేంద్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఈ వేడుక‌ల‌కు ప్ర‌ధాని ముఖ్యఅతిథిగా హాజ‌రుకానున్నారు.

Leave A Reply

Your email address will not be published.