రేపటి నుండి బడులు.. 17 వరకు ఒంటి పూట క్లాసులు
![](https://clic2news.com/wp-content/uploads/2021/04/school-children.jpg)
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ లో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు రేపటి నుండి పునఃప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎపి రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో… పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒంటి పూట పాఠశాలలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 7.30 గంటలనుంచి 11.30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కమార్ ఉత్తర్వులు జారీ చేశారు.