నేషనల్ జియోగ్రాఫికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో సైంటిస్ట్ పోస్టులు

NGRI: హైదరాబాద్‌లోని సిఎస్ఐఆర్ – నేషనల్ జియోగ్రాఫికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-NGRI)లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టులు 19 కలవు.
గ్రావిటి/ మాగ్నటిక్ / జిపిఎస్ / జియో థర్మల్/ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/ మెషిన్ లెర్నింగ్/ గ్యాస్ హైడ్రేట్స్ స్పెషలైజేషన్ తో జియోఫిజిక్స్/ జియో సైన్సెస్ / ఎర్త్ సైన్సెస్/ ఫిజికల్ సైన్స్ జియో కెమిస్ట్రీ/ జియోక్రొనాలజి/ ఐసోటోప్ జియాలజి/ స్ట్రక్చరల్ జియాలజి / రిమోట్ సెన్సింగ్ / రాక్ మెకానిక్స్ లో పిహెచ్‌డి పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగానుభవం కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతలు, , అనుభవాల ఆధారంగా సైంటిస్ట్ పోస్టులకు ఎంపిక జరుగుతుంది. పైన తెలిపిన వాటికంటే ఎక్కువ విద్యార్హతలు, అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.
ఎంపికైన వారికి నెలకు వేతనం రూ.1,37,907 అందుతుంది. దీనికి అదనం డిఎ, హెచ్ ఆర్ ఎ, టిఎ, వైద్య, బీమా , లీవ్ ట్రావెల్స్ కన్సెషన్ పెన్షన్ సిస్టమ్ మొదలైనవి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే సదుపాయాలన్నీ ఉంటాయి.
ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులను ఈ నెల 21వ తేదీ లోపు పంపించాలి. ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులు పంపితే.. చివరిదాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
- ఇంటర్వ్యూ తేదీ, ఇతర వివరాలను వెబ్‌సైట్ లో ప్రకటిస్తారు.
- ఇతర ప్రాంతాల్లో నివసించే వారు ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు సెకండ్ క్లాస్ ట్రైన్ ఛార్జీలు చెల్లిస్తారు.
- విదేశాల్లో నివసించే వారు అనుమతి తీసుకుని , ఆన్‌లైన్ల్‌లోనూ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://www.ngri.res.in/ వెబ్‌సైట్ చూడగలరు.