సిఎం కెసిఆర్ సైకత శిల్పం..

సిద్దిపేట (CLiC2NEWS): ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు రాష్ట్రమంతా ఘనంగా నిర్వహిస్తున్నారు. తమ నాయకుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్థిల్లాలని ఆకాంక్షించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలుచోట్ల అభిమానులు భారీ కేకులు కట్ చేసి పంచుతున్నారు. ఒక్కోచోట చీరలు పంపిణీ చేస్తున్నారు. మొక్కలు నాటారు. తమ ప్రియతమ నాయకుడి కోసం ఎంతటి ఖర్చుకైనా వెనకాడకుండా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. గజ్వేల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్ సిఎం కెసిఆర్ ముఖచిత్రంతో కూడిన సైకత శిల్పం తయారు చేయించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. కెసిఆర్ ముఖచిత్రంతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, రైతు సంబంధించిన సైకత శిల్పంను మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఆవిష్కరించారు.