సీహాక్: భార‌త నౌకాద‌ళంలో మ‌రో శ‌క్తివంత‌మైన అస్త్రం..

ఢిల్లీ (CLiC2NEWS): సముద్ర‌జ‌లాల్లో దాగి ఉన్న శ‌త్రు జ‌లాంత‌ర్గాముల ఖ‌చ్చిత చిత్రాన్ని ఆవిష్క‌రించ‌గ‌లదు, రాడార్ల‌ను నాశ‌నం చేయ‌గ‌ల శ‌క్తివంత‌మైన ఆస్త్రం సీహాక్ హెలికాప్ట‌ర్‌ భార‌త నౌకాద‌ళంలో చేర‌నుంది. ఎంహెచ్ 60 ఆర్ సీహాక్ అనే ఈ హెలికాప్ట‌ర్.. 38 లేజ‌ర్‌- గైడెడ్ రాకెట్‌లు, నాలుగు ఎంకె54 టోర్పిడోలు, మెషీన్ గ‌న్‌లు శ‌త్రువుల‌ను నాశ‌నం చేసేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. హెలికాప్ట‌ర్ ముందు భాగంలో ఫార్వ‌ర్డ్‌-లుకింగ్ ఇన్‌ఫ్రారెడ్ సెన్స‌ర్లు ఎదురుగా ఉన్న జ‌లాంత‌ర్గామి లేదా క్షిప‌ణికి సంబంధిచిన క‌చ్చిత‌మైన చిత్రాన్ని ఆవిష్క‌రించ‌గ‌ల‌దు. ఒక ప్రాంతాన్ని స్కాన్ చేయ‌డం.. క్షిప‌ణి దాడుల‌పై కూడా హెచ్చ‌రిక‌లు చేయ‌గ‌ల‌దు. ఈ హెలికాప్ట‌ర్‌కు కొచ్చిలోని ఐఎన్ ఎస్ గ‌రుడ‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.