నైతిక విలువ‌ల స‌లహాదారుగా చాగంటి కోటేశ్వ‌ర‌రావు

నామినేటెడ్ ప‌ద‌వుల రెండో జాబితా..

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఎపిలో కూట‌మి ప్ర‌భుత్వం నామినేటెడ్ ప‌ద‌వుల రెండో జాబితాను విడుద‌ల చేసింది. వివిధ సామాజిక వ‌ర్గాల సంక్షేమ‌, అభివృద్ధి కార్పొరేష‌న్‌ల‌కు ఛైర్మ‌న్‌ల‌ను నియ‌మించిన‌ట్లు ప్ర‌క‌టించింది. మొత్తం 59 మందిని నామినేటెడ్ ప‌దవుల‌లో నియ‌మించింది. ప్ర‌ముఖ ప్ర‌వ‌చ‌న క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావును రాష్ట్ర నైతిక విలువ‌ల స‌ల‌హాదారుగా నియ‌మించ‌డ‌మే కాకుండా.. ఆయ‌నకు క్యాబినెట్ ర్యాంకును ఇచ్చారు.

స్వ‌చ్ఛ అంధ్ర‌ప్ర‌దేశ్ మిష‌న్ (ప‌ట్టాభిరామ్‌), ఎపిక‌ల్చ‌ర్ మిష‌న్ (తేజ‌స్వి), ఎపి స్టేట్ ఫైబ‌ర్‌నెట్ (జివి రెడ్డి), ఫారెస్ట్ డెవ‌ల‌ప్‌మెంట్ సుజ‌య్ కృష్ణ‌, గ్రంథాల‌య ప‌రిష‌త్ జి.కోటేశ్వ‌రరావు .. వివిధ ప‌ట్ట‌ణాల అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటిల‌కు ఛైర్మ‌న్‌ల‌ను నియ‌మించింది. తొలి జాబితాలో ఆర్‌టిసి, పౌర‌స‌ర‌ఫ‌రాలు, ఎపిఐఐసి, వ‌క్ఫ్ బోర్డు వంటి 20 కీల‌క కార్పొరేష‌న్ల‌కు ఛైర్మ‌న్‌ల‌ను నియ‌మించింది.

Leave A Reply

Your email address will not be published.