తెలంగాణలో రేపే రెండో విడత రుణమాఫీ

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోని రైతన్నలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రైతులకు రెండో విడత రుణమాఫీ ప్రక్రియ మంగళవారం సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగే ఈకార్యక్రమంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నారు. మొదటి విడతలో జులై 19న తొలి విడత లక్ష రూపాయల వరకు మాఫీ చేసిన సర్కార్. ఈసారి రెండో విడతలో లక్షన్నర వరకు రైతుల రుణాలు మాఫీ చేయనున్నారు. ఈ మేరకు నగదును రైతుల రుణ ఖాతాలలో జమ చేస్తారు. ఈ నిర్ణయంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.