ఇరు దేశాల మధ్య సైనిక చర్య పరిష్కారం కాదు.. ఐరాస

న్యూయార్క్ (CLiC2NEWS): పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రికత్తలు నెలకొన్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య కొన్నేళ్లుగా ఎన్నడూ లేనంత విధంగా ఉద్రిక్తతలు కొనసాగుతుండటం బాధాకరమని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గెటెరస్ అన్నారు. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రసంగిస్తూ.. పహల్గాం ఉగ్రదాడిని ఖండించారు. ఇరు దేవాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. పౌరుల్ని లక్ష్యంగా చేసుకోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదిన.. సైనిక ఘర్షణ నివారించడంతో ఎంతో అవసరమన్నారు.
ఏప్రిల్ 22జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రజల్లో భావోద్వేగాలను తాన ఆర్దం చేసుకోగలని, కానీ.. ఇందుకు సైనిక చర్య మాత్రం పరిష్కారం కాదని గుటెరస్ అన్నారు. పొరపాట్లు చేయొద్దని, సంయమనం పాటించాలని ఇరు దేశాలకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఉద్రిక్తతలు తగ్గించే దౌత్యాన్ని, శాంతిని పునరుద్ధరించేలా ఏ చర్యకైనా మద్దతు ఇచ్చేందుకు ఐరాస సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.