తెలంగాణలో డబల్ ఇంజిన్ సర్కారుకు ప్రజలు పట్టాలు వేస్తున్నారు: మోడీ
హైదరాబాద్ (CLiC2NEWS): సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభలో ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. సోదర సోదరీమణులకు నమస్కారాలు అంటూ ప్రధాని తెలుగులో ప్రసంగం ప్రాంభించారు. తెలంగాణ ప్రజలకు బిజెపిపై నమ్మకం పెరిగిందని అన్నారు.ఎంతో దూరం నుండి వచ్చిన ప్రతి కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. తెలంగాణ నేలతల్లికి వందనం సమర్పిస్తున్నానని, తెలంగాణ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. తెలంగాణ మొత్తం ఈ మైదానంలో కూర్చున్నట్లు ఉందని మోడీ అన్నారు. ప్రాచీన సంస్కృతి, పరాక్రమానికి తెలంగాణ పుణ్యస్థలమని, దేశ ప్రజలకు యాదాద్రి నరసింహస్వామి, గద్వా జోగులాంబ, వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని మోడీ అన్నారు.
ఆవిష్కరణల్లో తెలంగాణ దేశంలోనే కేంద్రంగా మరిందని, తెలుగులో సాంకేతిక, వైద్య విద్య అందుబాటులోకి వస్తే పేదల కలలు సాకారమవుతాయి. మా పాలనలో గ్రామాల్లోని యువతకు ప్రోత్సాహం ఇస్తున్నామని, తెలంగాణ రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. తెలంగాణలో రూ. 35 వేల కోట్లతో 5 భారీ ప్రాజెక్టులు చేపట్టామని అన్నారు. భాగ్యనగరంలో అనేక ప్లై ఓవర్లు నిర్మించామని, హైదరాబాద్ చుట్టూ ప్రాంతీయ రింగ్ రోడ్డు కూడా నిర్మిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్రంలో మొగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని మోడీ అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చి తీరుతుందని, ప్రజలు పట్టాలు వేస్తున్నారని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుంది. తెలంగాన ప్రజల ఆశీస్సుల కోసమే వచ్చా అని ప్రధాని మోడీ అన్నారు.
nhl jerseys cheap
If some one desires expert view concerning blogging and site-building
after that i propose