AP: అక్రమంగా తరలిస్తున్న 4కిలోల బంగారం పట్టివేత
ఆభరణాల రూపంలో అక్రమ రవాణా

విశాఖపట్నం (CLiC2NEWS) : యశ్వంత్‌పూర్ -హవ్‌డా సూపర్ పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా తరలిస్తున్న 3.98కిలోల బంగారం గుర్తించి డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారంతో విశాఖ రైల్వే స్టేషన్‌లో రైలును ఆపి తనిఖీచేయగా కోల్‌కతా నుంచి వస్తున్న ప్రయాణికుడి వద్ద రూ. 1.91కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించారు. బంగారం తరలిస్తున్న వ్యక్తిని డిఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.