Hyderabad: 462 కిలోల గంజాయి పట్టివేత

హైదరాబాద్‌ (CLiC2NEWS): నగరంలోని మల్కాజిగిరి పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. మాల్కాజిగిరి ప‌రిధిలోని కౌకుర్‌ దర్గా వద్ద రెండు కార్ల‌లో తరలిస్తున్న 462 కిలోల గంజాయిని ఎక్సైజ్‌ పోలీసులు ప‌ట్టుకున్నారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు కోటి రూపాయ‌ల‌కు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయిని తరలిస్తున్న మహ్మద్ ఫరీద్, ఇస్మాయిల్, సచిన్ చవాన్, బస్వరాజు ను పోలీసులు అరెస్టు చేసిన‌ట్లు మేడ్చ‌ల్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ ర‌వికాంత్ తెలిపారు. నిందితుల వాహ‌నాల‌ను సీజ్‌ చేశారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్ర‌-ఒడిశా సరిహద్దుల్లో గంజాయిని తీసుకొని కర్ణాటక, మహారాష్ట్రకు తరలించేందుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తుండగా అబ్కారీ పోలీసులు పట్టుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.