నిర్మల్‌లో భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత

నిర్మల్‌ (CLiC2NEWS): ప‌ట్ట‌ణంలో అక్రమంగా పెద్ద ఎత్తున్న తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. బీలోలి నుంచి నిర్మల్ వైపు గుట్కాను తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు మంచిర్యాల చౌక్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ త‌నిఖీల్లో బొలేరో వాహనంలో తరలిస్తున్న గుట్కా బ్యాగుల (విలువ సుమారు రూ.4,72,700 ఉంటుందని పోలీసుల అంచ‌నా)ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఘ‌ట‌న‌లో షేక్ ముబీన్(౩౦) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణ సిఐ కుమారస్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిషేధించిన గంజాయి గుట్కా, టొబాకో ముడి పదార్థాలు కలిగి ఉన్నా, అక్రమంగా రవాణా చేసినా, ఇతరులకు అమ్మినా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.