AP: సెల్ఫ్ స‌ర్టిఫికేష‌న్ స్కీమ్‌.. ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాలు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆన్‌లైన్ బిల్డింగ్ ప‌ర్మిష‌న్.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా భ‌వ‌న నిర్మాణ అనుమ‌తుల కోసం సెల్ఫ్ స‌ర్టిఫికేష‌న్ స్కీమ్‌ను ప్రేవేశ‌పెట్టారు. ఈ స్కీమ్ కింద ఎపిలో భ‌వ‌న నిర్మాణ అనుమ‌త‌ల‌పై రాష్ట్ర స‌ర్కార్ మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. ఇక నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప‌ట్ట‌ణ ప్రాంత స్థానిక సంస్థ‌లే అనుమ‌త‌లు ఇచ్చేలా మార్గ‌ద‌ర్శకాలు జారీ చేసింది. సిఆర్‌డిఎ మిన‌హా అన్ని చోట్లా అనుమ‌తులు జారీ చేసే అధికారాన్ని అర్బ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటిల ప‌రిధి నుండి ప‌ట్ట‌ణ ప్రాంత స్థానిక సంస్థ‌ల‌కు బ‌దిలీ చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది.

300 చ‌ద‌ర‌పు మీట‌ర్లు మించ‌ని నిర్మాణాల‌కు స్వ‌యంగా య‌జ‌మానులే ప్లాన్ ధ్రువీక‌రించి ద‌ర‌ఖాస్తు చేసేలా అవ‌కాశం క‌ల్పిస్తూ మార్గ‌ద‌ర్శ‌కాలు ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. లైసెన్స్‌డ్ టెక్నిక‌ల్ ప‌ర్స‌న్‌లు కూడా ఇంటి ప్లాన్ ను ధ్రువీక‌రించి అప్‌లోడ్ చేసే అవ‌కాశం క‌ల్పించింది. కేవ‌లం నివాస భ‌వ‌నాల‌కు మాత్ర‌మే ప్ర‌భుత్వం ఈ వెసులు బాటు క‌ల్పించింది. పోర్టల్లో ప్లాన్ ఆప్‌లోడ్ చేసేందుకు నిబంధ‌న‌ల‌ను స‌ర‌ళ‌త‌రం చేసింది.

ఆన్‌లైన్ బిల్డింగ్ ప‌ర్మిష‌న్ సిస్టంలో ఎలాంటి ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డినా సంబంధిత భ‌వ‌నాల య‌జ‌మానుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని మార్గ‌ద‌ర్శ‌కాల్లో స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు పుర‌పాల‌క శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి సురేశ్ కుమార్ మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేశారు.

 

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.