సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మన్నవ బాలయ్య శనివారం కన్నుమూశారు. సినీరంగంలో విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులలో మంచి గుర్తింపు ఏర్పరచుకున్నారు బాలయ్య. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతన్నబాలయ్య శనివారం యూసఫ్‌గూడలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మృతి గురించి తెలుసుకున్న సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. పుట్టిన రోజునాడే ఆయన కన్నుమూయడం విషాదకరం.
దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించారు. `ఎత్తుకు పై ఎత్తు` సినిమాతో నటుడిగా తెరకు పరిచయం అయ్యారు.
బాలయ్య నటుడిగానే కాకుండా నిర్మాతగా, రచయితగా, దర్శకుడిగా పలు విభాగాల్లో పనిచేసి సినీరంగంలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆయన కథా రచయితగా `ఊరికిచ్చిన మాట` సినిమాకు నంది అవార్డును అందుకున్నారు.
పార్వీతీకల్యాణం, ఇరుగుపొరుగు, బొబ్బిలియుద్ధం, పాండవ వనవాసం, మొనగాళ్లకు మొనగాడు, శ్రీకృష్ణ పాండవీయం, విక్రమార్క విజయం, అల్లూరి సీతారామరాజు, ప్రాణ స్నేహితులు, మహారాజశ్రీ మాయగాడు, పెద్దరికం, గాయం, యమలీల, పెళ్లిసండడి, అన్నమయ్య, మన్మథుడు, మల్లీవ్వరి, శ్రీరామరాజ్యం వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టయి.