సీనియర్ నటి జమున కన్నుమూత!
హైదరాబాద్ (CLiC2NEWS): టాలీవుడ్ సీనియర్ నటి జమున (86) కన్నుమూశారు. కొంతకాలంగా వయోసంబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జమున… హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. జమున తెలుగు తమిళ, కన్నడ, హిందీ భాషల చిత్రాల్లో నటించారు. ఆమె మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
1936 ఆగస్టు 30న హంపీలో జమున జన్మించారు. నిప్పటి శ్రీనివాసరావు, కౌసల్యాదేవి ఆమె తల్లదండ్రులు. సినిమాల్లోకి రాకముందు ఆమె పేరు జానాభాయి. జ్యోతిషుల సూచనతో ఆమె పేరును తల్లిదండ్రులు జమునగా మర్చారు. ఆమె బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. డాక్టర్ గరికపాటి రాజారావు ఆమెకు జమునకు మొదటి సినీ అవకాశం ఇచ్చారు. మొదటిసారి జమున 1952లో విడుదలైన పుట్టిల్లు సినిమా కోసం పనిచేశారు. సినీ నటిగానే కాకుండా రాజకీయాల్లో కూడా రాణించారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున రాజమహేంద్రవరం నుంచి లోక్‌సభకు ఆమె ఎన్నికయ్యారు.