సీనియర్ నటి ఆర్ సుబ్బలక్ష్మి కన్నుమూత

కొచ్చి (CLiC2NEWS): సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలు దక్షిణాది చిత్రాల్లో నటించిన సీనియర్ నటి సుబ్బలక్ష్మి కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆర్ సుబ్బలక్ష్మి తెలుగు, తమిళం, మలయాల భాషల్లో కలిపి 70కి పైగా చిత్రాల్లో నటించారు. 1951లో ఆల్ిండియా రేడియోలో ఉద్యోగిగా పనిచేశారు. దక్షిణ భారత దేశం నుండి ఆల్ ఇండియా రేడియోలో పనిచేసిన తొలి లేడీ కంపోజర్ ఆర్. సుబ్బలక్ష్మి. తెలుగులో ‘కళ్యాణరాముడు’, ‘ఏ మాయ చేసావె’ చిత్రాల్లో నటించారు. ఏ మాయ చేసావే చిత్రంలో సమంతకు అమ్మమ్మగా నటించారు. చివరిసారిగా విజయ్ ‘బీస్ట్’లో కూడా నటించారు. ఆమె డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేశారు.