కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (డిఎస్) కన్నుమూత
హైదరాబాద్ (CLiC2NEWS): కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజి సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ నగరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన .. గుండెపోటుతో మృతిచెందినట్లు సమాచారం. 1989లో నిజామాబాద్ నుండి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999, 2004లో కూడా ఎమ్మెల్యేగా సేవలందించారు. పిసిసి అధ్యక్షునిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బిఆర్ ఎస్ లో చేరారు. రాజ్యసభ సభ్యుడిగా 2016 నుండి 2022 వరకు కొనసాగారు. అనంతరం తిరిగి మళ్లీ హస్తం గూటికి చేరారు.
డిఎస్‌కు ఇద్దరు కుమారులు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్ ప్రస్తుతం బిజెపి తరపున నిజామాబాద్ ఎంపిగా ఎన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్‌గా పనిచేశారు.