భార్య‌, మేన‌ల్లుడిని కాల్చి.. ఆపై ఆత్మ‌హ‌త్య చేసుకున్న పోలీసు అధికారి

పుణె (CLiC2NEWS): ఓ సీనియ‌ర్ పోలీసు అధికారి త‌న భార్య‌ను, మేన‌ల్లుడిని చంపి తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర , పుణెలో జ‌రిగింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అమరావ‌తి అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ విధులు ముగించుకొని సోమ‌వారం ఉద‌యం ఇంటికి చేరుకున్న అనంత‌రం త‌న భార్య‌ను తుపాకీతో కాల్చాడు. ఆ శ‌బ్దానికి ప‌క్క గ‌దిలోఉన్న కుమారుడు, మేన‌ల్లుడు బ‌య‌టికి రాగా.. మేన‌ల్లుడుపై కూడా కాల్పులు జ‌రిపాడు. ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. అనంత‌రం తాను ఆత్మ‌హ‌త్య చేసుకుని ఆ అధికారి ప్రాణాలు కోల్పోయిన‌ట్లు స‌మాచారం. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.